గురువారం 28 మే 2020
Telangana - May 04, 2020 , 19:21:18

'పాలమూరులో కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తేస్తున్నాం'

'పాలమూరులో కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తేస్తున్నాం'

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లాలో గత 27 రోజుల నుంచి ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్పష్టం చేశారు. నేటి నుంచి జిల్లాలో ఉన్న కంటైన్‌మెంట్‌ జోన్లను ఎత్తివేస్తున్నామని మంత్రి ప్రకటించారు. కరోనా కేసుల నివారణకు ఎంతగానో శ్రమించిన జిల్లా యంత్రాంగానికి మంత్రి అభినందనలు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి వచ్చిన వారు తప్పకుండా పోలీసులకు సమాచారం అందించి, 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. కూలీలు ఎక్కడి వారు అక్కడే పని చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొదటిసారి మెడికల్‌ విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు.


logo