సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Aug 03, 2020 , 00:11:17

ఇసుక మాఫియాను వదిలిపెట్టం

ఇసుక మాఫియాను వదిలిపెట్టం

  • ఎక్సైజ్‌, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ 

మహబూబ్‌నగర్‌ క్రైం: ఇసుక మాఫియా, ఫిల్టర్‌ ఇసుక తయారు చేసేవారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ఎక్సైజ్‌,క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హెచ్చరించా రు. ఆదివారం మహబూబ్‌నగర్‌ జెడ్పీ సమావేశ మం దిరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పాలనలో ప్రభుత్వ పథకాలన్నీ పారదర్శకంగా అమలవుతున్నాయని చెప్పారు. ఇటీవల తిర్మలాపూర్‌ ఘటనలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతిచెందిన విషయంలో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయంలేదని చెప్పారు. మాఫియాను పోత్సాహించాలంటే ఇసుకపాలసీ తెచ్చేవాళ్లమే కాదని శ్రీనివాస్‌గౌడ్‌  స్పష్టంచేశారు.  గతంలో 2004 నుంచి 2014 వరకు ఇసుక ద్వారా ప్రభుత్వానికి రూ.39.66 కోట్లు ఆదాయం సమకూరితే.. టీఆర్‌ఎస్‌ వచ్చాక ఆరేండ్లలో రూ.3,114 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు.  సమైక్య పాలనలో ప్రభుత్వానికి ఇసుక ద్వారా రూపాయి రాలేదనీ.. ఇసుక మాఫియా అప్పుడుందా?.. ఇప్పుడుందా? అని ప్రశ్నించారు.logo