శనివారం 04 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 11:01:34

మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మొక్కలు నాటిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ : ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రతి శుక్రవారం గ్రీన్ ఫ్రైడే గా పాటించి మొక్కలు నాటాలన్న పిలుపు మేరకు.. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈత, జామ, అరెలియా, మందారం మొక్కలను తన కుమార్తె శ్రీహిత మనుమరాలు సిద్దిక్షతో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పట్టణాల్లో భారీగా మొక్కలు నాటి.. హరిత పట్టణాలుగా తీర్చిదిద్దటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. విరివిగా మొక్కలు నాటి రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మారుద్దామన్నారు.logo