బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 12:26:54

పీవీ ఏ అన్యాయాన్ని సహించ‌లేదు : మ‌ంత్రి శ్రీనివాస్ గౌడ్‌

పీవీ ఏ అన్యాయాన్ని సహించ‌లేదు : మ‌ంత్రి శ్రీనివాస్ గౌడ్‌

హైద‌రాబాద్ : తెలంగాణ గ‌డ్డ మీద పుట్టిన పీవీ న‌ర‌సింహారావు ఏ అన్యాయాన్ని స‌హించ‌లేదు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ ప్ర‌ధాని పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బ‌ల‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప‌ట్వారీ నుంచి ప్ర‌ధాని వ‌రకు పీవీ అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చి దేశానికే వ‌న్నె తెచ్చారు. అలాంటి తెలంగాణ ముద్దుబిడ్డ‌కు దేశంలో స‌రైన గౌరవం ద‌క్క‌లేదు. ఈ క్ర‌మంలో పీవీకి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తున్న‌ది. అపారమైన జ్ఞానంతో అనేక సంస్క‌ర‌ణ‌లు తెచ్చి దేశంలో ఓ గొప్ప‌గా వ్య‌క్తిగా నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా పీవీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలు నిరాడంబ‌రంగా జ‌రుగుతున్నాయి. పీవీ పుట్టిన‌, పెరిగిన ప్రాంతాల‌ను ప‌ర్యాట‌క ప్రాంతాలుగా తీర్చిదిద్ద‌బోతున్నామ‌ని తెలిపారు. ప‌ట్వారీగా ఉన్న స‌మ‌యంలోనే 830 ఎక‌రాల‌ను పేద‌ల‌కు పంచిపెట్టారు. సీఎం కేసీఆర్ హ‌యాంలో తెలంగాణ‌లో పీవీకి గుర్తింపు రావ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 


logo