శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 26, 2020 , 12:19:34

నిత్యావసరాల కొరత లేకుండా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యవేక్షణ

నిత్యావసరాల కొరత లేకుండా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ పర్యవేక్షణ

మహబూబ్‌నగర్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు క్షేత్రస్థాయిలో పర్యటించారు. పర్యటన సందర్భంగా నిత్యావసరాల కొరత లేకుండా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా ఉండేందుకు మహబూబ్‌నగర్‌ పట్టణకేంద్రంలో మోడల్‌ రైతుబజార్‌లో కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించారు. అదేవిధంగా పట్టణంలోని న్యూ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఏనుగొండ నుండి న్యూటౌన్‌ వరకు విస్తరించి ఉన్న స్థానిక ప్రజలకు కూరగాయలు అందుబాటులోకి తేవడం కొరకు మెట్టుగడ్డలోని బీఈడీ కళాశాలలో స్థలాన్ని పరిశీలించారు. వెంటనే రేపటి నుండి అక్కడ తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

logo