గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 01:08:37

కేసీఆర్‌తోనే కులవృత్తులకు పూర్వవైభవం

కేసీఆర్‌తోనే కులవృత్తులకు పూర్వవైభవం

  • గౌడహాస్టల్‌ శంకుస్థాపనలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

ఉప్పల్‌, జనవరి 9: రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడలు, పర్యాటక, సాంస్కృతికశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఉప్పల్‌ భగాయత్‌ ప్రాంతంలో గౌడహాస్టల్‌ నూతన భవనం నిర్మాణానికి శనివారం ఆయన భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యనారాయణ, మాజీ ఎంపీలు బూర నర్సయ్యగౌడ్‌, మధుయాష్కీగౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. logo