e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home తెలంగాణ క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

హైదరాబాద్‌: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. తద్వారా తెలంగాణను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించడానికి రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని తెలిపారు. ఉన్నత విద్య కోసం 0.5 శాతం, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలోని వెలో డ్రమ్ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్న 72వ జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్ షిప్‌ను మంత్రి ప్రారంభించారు.

క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడా సదుపాయాలు, క్రీడల అభివృద్ధికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. క్రీడా హబ్‌గా రూపొందించడానికి హైదరాబాద్‌ అనువైన సిటీగా దేశంలో ఇప్పటికే గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్

ఈ చాంపియన్‌షిప్‌లో 27 రాష్ట్రాల నుంచి దాదాపు 7 వందల మంది సైక్లింగ్ రైడర్లు పాల్గొంటున్నారని చెప్పారు. మార్చి 31 వరకు జరగనున్న ఈ పోటీలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

Advertisement
క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం: మంత్రి శ్రీనివాస్‌ గౌడ్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement