శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 17:45:51

షాద్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో మినీ స్టేడియం ప్రారంభం

షాద్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో మినీ స్టేడియం ప్రారంభం

రంగారెడ్డి : జిల్లాలోని షాద్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో రాష్ర్ట ప‌ర్యాట‌క‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా షాద్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో రూ. 210 కోట్ల‌తో నిర్మించిన మినీ స్టేడియాన్ని మంత్రి ప్రారంభించారు. రాష్ర్ట వ్యాప్తంగా స్టేడియంల‌ను అభివృద్ధి చేయ‌డానికి టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చిత్తశుద్ధితో ఉంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అట్ట‌డుగు స్థాయిలో ఉన్న వారి నుంచి క్రీడా ప్ర‌తిభ‌ను వెలికితీసేందుకు స్టేడియంల అభివృద్ధి స‌హాయ ప‌డుతుంద‌న్నారు.  

మినీ స్టేడియం ప్రారంభించిన అనంత‌రం ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలలో రూ. 8 లక్షలతో నిర్మించనున్న అంతర్గత మురికి కాలువ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంత‌రం రూ. 180 లక్షలతో నిర్మించిన క్రిమిటోరియం ప్రహరీ గోడను ప్రారంభించారు. చేవెళ్ల‌లో ఎక్సైజ్ పోలీసు స్టేష‌న్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.