శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 00:15:41

కరోనా అంతుచూద్దాం

కరోనా అంతుచూద్దాం

  • ఎవరైనా విదేశాల నుంచి వస్తే సమాచారమివ్వాలి
  • అధికారులతో సమీక్షలో మంత్రి  శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ప్రజల శ్రేయస్సు కోసమే సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించినట్టు ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌ గౌడ్‌ చెప్పారు. సోమవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లో కరోనా మహమ్మారిని ఎదుర్కొనే అంశంపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణలో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రథమస్థానంలో ఉన్నదన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు కరోనా వైరస్‌పై గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాకు ఇతర రాష్ర్టాలు, దేశాల నుంచి వచ్చిన వారు వెంటనే జిల్లా అధికారులకు సమాచారమందించాలని సూచించారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్‌ వెంకట్రావు, ఎస్పీ రెమా రాజేశ్వరితోపాటు వైద్యం, పోలీసు, రవాణా, నీటి పారుదల, పంచాయతీ, మున్సిపల్‌, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మహబూబ్‌ నగర్‌ పట్టణంలో పర్యటించి.. తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు.logo