e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తావా? బండికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌వాల్‌

అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తావా? బండికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌వాల్‌

అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తావా? బండికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌వాల్‌

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు బండి సంజయ్‌కు ఛాలెంజ్ చేస్తున్నాను.. నా పాస్ బుక్‌లో ఉన్నదాని కంటే ఒక్క గజం ఎక్కువ ఉంటే మొత్తం దానం చేస్తాను అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్ప‌ష్టం చేశారు. బండి సంజయ్ చెప్పిన సర్వే నెంబర్‌లో పట్టాభూమి కాకుంటే నా మొత్తం ఆస్తి దానం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. నా దగ్గర ఉన్న సర్వే నంబర్లు తప్పు అయితే నా అన్ని పదవులకు రాజీనామా చేస్తా- నిజం కాకపోతే సంజయ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా? అని స‌వాల్ విసిరారు.


తెలంగాణ భ‌వ‌న్‌లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. నిన్న బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌ల‌పై, ఆయ‌న తీరుపై స‌మాజ‌మే సిగ్గు ప‌డుతుంద‌న్నారు. ఒక జాతీయ పార్టీ రాష్ర్ట అధ్య‌క్షుడిన‌ని మ‌రిచిపోయి, చ‌రిత్ర గ‌ల నాయ‌కుల‌పై నిందారోపణ‌లు చేయ‌డం చాలా బాధాక‌ర‌మ‌న్నారు. ఒక‌రి గురించి మాట్లాడే ముందు వారి చ‌రిత్ర తెలుసుకొని మాట్లాడాలి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో ఆయ‌న ఎక్క‌డున్నారు.. తాము ఎక్క‌డ ఉన్నామో ఆయ‌న తెలుసుకోవాలి. ఒక ఉద్యోగిగా ఉండి.. తెలంగాణ సాధ‌న‌లో సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉన్నాం. ప్రాణాల‌కు తెగించి, జైళ్ల‌కు పోయినా త‌మ‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదు.

తెలంగాణ ఉద్య‌మంలో బండి సంజ‌య్ స్థానం ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నించారు. క‌లిసొచ్చిన అధ్య‌క్ష ప‌ద‌వికి గౌర‌వం ఇస్తూ మాట్లాడితే బాగుండు అని సూచించారు. ఉద్య‌మ స‌మ‌యంలో బీజేపీ నాయ‌కుల స‌భ‌ల‌కు తాము స‌హ‌క‌రించామ‌న్నారు. ఉద్య‌మంలో భాగంగా ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాం. తుపాకీతో కాల్చుతామంటే కూడా ప్రాణాల‌కు బెద‌ర‌కుండా ఉద్య‌మంలో పాల్గొన్నాం. జైళ్ల‌కు వెళ్లామ‌ని గుర్తు చేశారు. వ్య‌క్తిగ‌త దూష‌ణ‌లు చేయ‌డం స‌రికాదు. తెలంగాణ‌కు నిధులు ఇవ్వ‌క‌పోయినా, క‌రోనా వ్యాక్సిన్ల విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హించినా ప్ర‌ధానిని విమ‌ర్శించ‌లేదు. తాము కేంద్రం ప‌ట్ల గౌర‌వంగా ఉన్నామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ఏక‌వ‌చ‌నంలో విమ‌ర్శ‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు.


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి ఓ లుచ్చా నాయ‌కుడు కాగితం పంపిస్తే దాన్ని చూసి మాట్లాడుతారా? అని ప్ర‌శ్నించారు. ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ ఇంజినీరింగ్ కాలేజీలు నడుపుకోవ‌చ్చు మీరు. మీరు విలాస‌వంత‌మైన గెస్ట్ హౌజ్‌లు నిర్మించుకొని, స్విమ్మింగ్ ఫూల్స్‌లో జ‌ల‌కాలు ఆడొచ్చు. పేద‌ల భూముల‌ను గుంజుకోవ‌చ్చు. క‌ల్లు, ఇసుక‌, కంక‌ర మిష‌న్ల దందాలు నిర్వ‌హించుకోవ‌చ్చు. దౌర్జ‌న్యాలు చేయొచ్చు. మీరు చేస్తే సంసారం.. తాము చేస్తే వ్య‌భిచారం. మీరు రాజ‌భోగాలు అనుభవిస్తే త‌ప్పు లేదు కానీ.. తాము మంచిగా బ‌తుకుతే త‌ప్పా అని ప్ర‌శ్నించారు. తాను చెమ‌టోడ్చి భూముల‌ను కొన్నాను. త‌న‌కు భూములు అమ్మిన వారంతా బ‌తికే ఉన్నారు అని తెలిపారు. తాను మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 5 ఎక‌రాల్లో ఇల్లు కట్టుకుంటే తప్పా? అని ప్ర‌శ్నించారు. బీసీ నాయ‌కుడిని అని చెప్పుకునే నీకు ఆ ల‌క్ష‌ణాలు లేనే లేవు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ విమ‌ర్శించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేస్తావా? బండికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ స‌వాల్‌

ట్రెండింగ్‌

Advertisement