సురవరం జయంతి ఉత్సవాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్ష

హైదరాబాద్ : తెలంగాణ వైతాళికులు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సురవరం ప్రతాపరెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో మంత్రి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో గల తన కార్యాలయంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సురవరం సాహిత్య, చరిత్ర పరిశోధన, జర్నలిజం రంగాలలో చేసిన సేవలను నేటి తరానికి అందించేందుకు తెలంగాణ సంస్కృతికశాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేయాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ వైతాళికులను, సంగీత, సాహిత్య వేత్తలను, కవులను, మేధావులను, కళాకారులు మొదలైన రంగాలలో విశిష్ట సేవలందించిన ప్రముఖుల జయంతి, వర్ధంతిలను అధికారికంగా ఘనంగా నిర్వహించి గౌరవిస్తున్నట్లు తెలిపారు. మే 28న సురవరం జయంతిని పురస్కరించుకుని వారి స్వగ్రామం అలంపూర్ చౌరస్తాలో గాని లేదా ఇటిక్యాల వద్ద వారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అందుకు అవసరమైన స్థల పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు.
సురవరం ప్రతాప్ రెడ్డి రచించిన కథలను, నాటకీకరించి నాటకోత్సవాలను సంగీత నాటక అకాడమీ ద్వారా నాటకాలుగా ప్రదర్శించేలా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌తో పాటు పాత ఉమ్మడి 10 జిల్లా కేంద్రాలలో కవి సమ్మేళనాలు, సాహితీ చర్చలు మేధావులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలని మంత్రి అధికారులను కోరారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలతో నిర్వహించి వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేలా పుస్తక ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. షార్ట్ ఫిలిమ్స్ వీడియో కాంటెస్ట్ లు నిర్వహించాలని, వీటితో పాటు తెలుగు యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ లలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య కృషి మీద చర్చలు జరపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టడంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. వీటితో పాటు తెలంగాణ రాష్ట్రంలో సురవరం ప్రతాపరెడ్డి పేరుతో రాష్ట్రస్థాయి అవార్డు ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించేలా చర్యలు చేపట్టాలని సాంస్కృతికశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సురవరం ప్రతాపరెడ్డి కుటుంబ సభ్యులు కపిల్, గిరిధర్ రెడ్డి, నివేదిత, పుష్పలత, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- సెకండ్ డోస్ తీసుకున్నాక.. కరోనా సోకింది..!
- మమతపై సువెందు పోటీ.. 57 మందితో బీజేపీ తొలి జాబితా
- ఆర్ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 66 లక్షలు సీజ్..
- మళ్లీ మోగింది ‘ప్రైవసీ’ గంట: వాట్సాప్ న్యూ రిమైండర్లు
- అదే జరిగితే వందేళ్లు వెనక్కి : మంత్రి హరీశ్‌రావు
- అనుష్క తర్వాతి సినిమాలో హీరో ఆ కుర్రాడా?
- టీఎంసీలో టికెట్ నిరాకరణ.. బీజేపీలో చేరుతానంటున్న సొనాలీ గుహా
- 14 ఏండ్ల బాలుడిపై మహిళ లైంగికదాడి.. ప్రస్తుతం గర్భవతి
- మీ ఆధార్‌ను ఎవరైనా వాడారా.. ఇలా తెలుసుకోండి
- ఒకవైపు ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుక.. మరోవైపు ఇద్దరు హత్య