శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 19:43:03

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శిల్పారామంపై మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ సమీక్ష‌

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ శిల్పారామంపై మంత్రి శ్రీ‌నివాస్‌గౌడ్ సమీక్ష‌

మహబూబ్‌న‌గ‌ర్ : మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ట్యాంక్‌బండ్ అదేవిధంగా నూత‌నంగా నిర్మించ‌నున్న శిల్పారామం ప‌నుల‌పై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంగ‌ళ‌వారం న‌గ‌రంలోని త‌న కార్యాల‌యంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్మించనున్నఈ శిల్పారామం స‌మ‌గ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) పై రూ.8 కోట్లతో ఇప్ప‌టికే టెండ‌ర్‌ను పిలిచిన‌ట్లు తెలిపారు. వీటితో పాటు ట్యాంక్‌బండ్ అభివృద్ధికి రూ. 14 కోట్లతో చేపట్టబోయే పనుల డీపీఆర్‌ల‌ను టూరిజం ఎండీ మనోహర్, కన్సల్టెంట్ బాలకృష్ణలతో కలసి పవర్ పాయింట్ ద్వారా పరిశీలించారు. అనంత‌రం వాటికి ఆమోదం తెలిపారు. పరిశీలించిన డీపీఆర్‌ల‌పై వారం రోజుల్లో టెండర్లు పిలవాలని ఆదేశించారు.