సోమవారం 13 జూలై 2020
Telangana - Apr 12, 2020 , 12:30:06

వలస కూలీలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసరాలు పంపిణీ

వలస కూలీలకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసరాలు పంపిణీ

మహబూబ్‌నగర్‌ : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో సహాయక చర్యలకు పూనుకున్నారు. ఈ క్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో పర్యటించించిన మంత్రి పేదలకు, వలస కూలీలకు నిత్యావర సరుకులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డలో క్రెడాయ్‌ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్‌ పట్టణంలోని గాయత్రి ఫంక్షన్‌హాల్‌లో నిరుపేదలకు నిత్యావసరాలను అందజేశారు. కరోనాపై ప్రభుత్వ పోరాటానికి చేయూతకు చంద్ర హాస్పిటల్స్‌ ఎండీ డా. అనసూయ రెడ్డి రూ. 50 వేల చెక్కును మంత్రికి అందజేశారు. అంతకుక్రితం మహబూబ్‌నగర్‌-జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు.logo