ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 17:35:42

క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కుల‌ను అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

క‌ల్యాణ‌ల‌క్ష్మి చెక్కుల‌ను అందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌ను ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో 236 మంది ల‌బ్దిదారుల‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ చెక్కుల‌ను అంద‌జేశారు. హ‌న్వాడ మండ‌లంలో 88 మంది ల‌బ్దిదారుల‌కు రూ. 88,90,000 విలువ చేసే చెక్కుల‌ను, జిల్లా కేంద్రంలోని జ‌డ్పీ మీటింగ్ హాల్‌లో 148 మంది ల‌బ్దిదారుల‌కు రూ. 1,45,21,000 విలువ చేసే చెక్కుల‌ను అంద‌జేశారు. చెక్కులను అందుకున్న ల‌బ్దిదారులు సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్‌కు ఎంతో రుణ‌ప‌డి ఉంటామ‌ని వారు అన్నారు. 

టీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ కార్య‌క‌ర్త‌లు

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మండ‌లంలోని ధ‌ర్మాపూర్‌కు చెందిన ఉప‌స‌ర్పంచ్ వెంక‌టేశ్ ఆధ్వ‌ర్యంలో బీజేపీకి చెందిన సుమారు 100 మంది కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్య‌క‌ర్త‌లంద‌రికీ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌. టీఆర్ఎస్ ప్ర‌భుత్వం చేప‌డుతున్న అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు ఆక‌ర్షితులై పార్టీలో చేరిన‌ట్లు వారు తెలిపారు.


logo