సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Apr 18, 2020 , 10:59:39

మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసరాలు పంపిణీ

మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నిత్యావసరాలు పంపిణీ

మహబూబ్‌నగర్‌ : నిరుపేదలకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ నేడు మహబూబ్‌నగర్‌ పట్టణంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. క్లాసిక్‌ ఎడ్యూకేషనల్‌ సొసైటీ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రేషన్‌ కిట్లు, బ్రెడ్‌ ప్యాకెట్లను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం స్థానిక అవంతి హోటల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్‌ను శ్రీనివాస్‌గౌడ్‌ సందర్శించారు. వినియోగదారులతో భౌతిక దూరం పాటించేలా చూడాలని దుకాణదారులకు సూచించారు. అదేవిధంగా పట్టణంలో లాక్‌డౌన్‌ అమలు తీరును మంత్రి పరిశీలించారు. పోలీసుల పనితీరును మంత్రి ఈ సందర్భంగా ప్రశంసించారు.
logo