బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 15:44:29

జనతా కర్ఫ్యూ పాటిస్తున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

జనతా కర్ఫ్యూ పాటిస్తున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

వనపర్తి: కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి జనతా కర్ఫ్యూను పాటించారు. మంత్రి  నిరంజన్‌ రెడ్డి వనపర్తి జిల్లా పాన్‌ గల్‌ లోని తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితమై..జనతా కర్ఫ్యూను పాటించారు. జనతాకర్ఫ్యూలో మేము కూడా భాగస్వాములమయ్యాం. ఎక్కడివాళ్లం అక్కడే స్వీయ నిర్బంధంలో ఉన్నాం. ప్రజలందరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేస్తున్నందుకు సంతోషకరమైన విషయం. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తూచా తప్పకుండా పాటించి మనల్ని మనం కాపాడుకుందామని నిరంజన్‌ రెడ్డి కోరారు. 


logo