బుధవారం 03 జూన్ 2020
Telangana - May 06, 2020 , 16:37:52

పంచె కట్టిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

పంచె కట్టిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అచ్చ తెలుగు వస్త్రధారణలో నేడు దర్శనమిచ్చారు. ఎర్ర అంచు పంచెతో మల్లె పువ్వువంటి తెల్లని దుస్తులు ధరించి చేతిలో గొడుగు చేబూని మంత్రి అగుపించారు. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం ఘణపురం బ్రాంచ్‌ కెనాల్‌పై మంత్రి ఈవాళ క్షేత్రస్థాయిలో పర్యటించారు. పంచె పైకి ఎత్తి పట్టుకుని చేతిలో గొడుగుతో కాలువగట్లపై కలియతిరుగుతూ పనులను పరిశీలించారు. పెండింగ్‌ పనులను పూర్తిచేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా వానకాలంలో చెరువులన్నీ నిండేలా ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

logo