ఆదివారం 17 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 11:53:57

భద్రాద్రి రాముడిని దర్శించుకున్న మంత్రి సత్యవతి

భద్రాద్రి రాముడిని దర్శించుకున్న మంత్రి సత్యవతి

భద్రాచలం : రాష్ట్ర  ప్రజలకు  గిరిజన సంక్షేమ శాఖ మంత్రిసత్యవతి రాథోడ్  ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ, బంధు, మిత్రులతో కలిసి ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఈ రోజు భద్రాద్రి  సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. స్వామిని దర్శించుకోవడం మహద్భాగ్యమని మంత్రి తెలిపారు. సీతారామచంద్ర స్వామి చల్లని చూపులు ఈ రాష్ట్రం మీద ఎప్పటికీ ఉండాలని, అందరూ సుఖ, సంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీ ఏరియాలో ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఏజెన్సీలోని గిరిజనుల సమగ్రాభివృద్ధికి దాదాపు 100 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామన్నారు.