గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Feb 16, 2020 , 21:59:01

రేపు సంగారెడ్డి, హైదరాబాద్ లో మంత్రి సత్యవతి పర్యటన

రేపు సంగారెడ్డి, హైదరాబాద్ లో మంత్రి సత్యవతి పర్యటన

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత ముఖ్యమంత్రి కేసీఆర్ 66వ జన్మదినోత్సవం సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ రేపు సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల్లో లక్ష మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మంత్రి సత్యవతి షెడ్యూల్..

* రేపు (ఫిబ్రవరి 17)ఉదయం 9.30 గంటలకు పటాన్ చెరు, జిన్నారం గిరిజన గురుకుల విద్యాలయంలో మొక్కలు నాటి గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల్లో లక్ష మొక్కల హరితహరం ప్రారంభించనున్నారు. 

* ఉదయం 11.30 గంటలకు మాసబ్ ట్యాంక్, డి.ఎస్.ఎస్ భవన్ లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమీర్ పేట, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ డైరెక్టరేట్ లో హరితహారంలో మొక్కలు నాటనున్నారు. logo
>>>>>>