గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 19:43:38

సీత్లా పండుగ సంబురాల్లో.. మంత్రి సత్యవతి రాథోడ్

సీత్లా పండుగ సంబురాల్లో.. మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : ప్రకృతిని, వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే గిరిజనులు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని సీత్లా పండుగను వైభవంగా జరుపుకుంటారు. వనదేవతలను పూజించే సీత్లా పండగ సంబురాల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లాలోని గుండ్రా తిమడుగు గ్రామం, పెద్దతండాలో పాల్గొన్నారు. పండగ సంబురాల్లో భాగంగా అందరితో కలిసి ఆడిపాడారు. సంప్రదాయ నృత్యం చేశారు. వనదేవతలకు ప్రసాదాలు సమర్పించారు. గిరిజనులను, ఈ రాష్ట్ర ప్రజలను క్షేమంగా చూడాలని, పాడిపంటలను కాపాడాలని కోరుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీత్లా పండగలోమంత్రిగా మా గ్రామంలోనే పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. వన దేవతలైన ఏడుగురు అమ్మవార్ల పూజ చేశామన్నారు. పాడి పశువులను నిరంతరం కాపాడమని వేడుకుంటూ చేసుకునే గొప్ప పండుగ సీత్లా పండుగ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజనులందరికీ మంత్రి సీత్లా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు


logo