Telangana
- Jan 05, 2021 , 13:45:42
అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సత్యవతి

ములుగు : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మంగళవారం ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జ్పడీ చైర్మన్ కుసుమ జగదీశ్‌తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. వెంకటాపురం మండలం పాత్రాపురంలో రూ.22లక్షలతో నిర్మించి రైతు వేదిక, ఉప్పెడు వీరాపురం గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అలాగే ఉప్పెడు వీరాపురం నుంచి పాలెం వాగు వరకు 6.63 కోట్ల నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ హనుమంతు జెండగే, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారన్నారు.
తాజావార్తలు
- క్షీరగిరి క్షేత్రంలో భక్తుల పూజలు
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం
- రహదారికి ఇరువైపులా మొక్కలు నాటించిన ముత్తిరెడ్డి
- ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం : కలెక్టర్
- ఏడాదిలో రూ.40.63 కోట్లతో అభివృద్ధి పనులు
- సమాజ సేవలో లయన్స్ క్లబ్‌లు..
- ఘనంగా ఓటరు దినోత్సవం
- రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
- రైతన్నల ఆప్తుడు సీఎం కేసీఆర్
- రైతు వ్యతిరేక చట్టాలను నిరసించాలి
MOST READ
TRENDING