మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 05, 2020 , 03:15:54

గిరిజనుల్లో విద్యా వెలుగులు

గిరిజనుల్లో విద్యా వెలుగులు

  • 289 మందికి సర్కారు ప్రోత్సాహం: మంత్రి సత్యవతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం, విద్యకు పెద్దపీట వేస్తున్నదని మంత్రి సత్యవతిరాథోడ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గిరిజన గురుకులాల్లో చదివి ఐఐటీ, ఎన్‌ఐటీ, త్రిపుల్‌ఐటీ, ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో చేరేందుకు అర్హత సాధించిన 289 మంది విద్యా ర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందజేసి నట్టు చెప్పారు. అందులో ఐఐటీ అర్హులకు రూ.50 వే ల విలువైన ల్యాప్‌టాప్‌, ఎన్‌ఐటీ, త్రిపుల్‌ఐటీ అర్హులకు రూ.40 వేలు విలు వ చేసే ల్యాప్‌టాప్‌, ఎంబీబీఎస్‌ అర్హులకు రూ.50,000, బీడీఎస్‌ అర్హులకు రూ.40వేల నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చామని మంత్రి వెల్లడిం చారు.   


logo