బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 15, 2020 , 18:59:57

వాగులను పరిశీలించిన మంత్రి సత్యవతిరాథోడ్‌

వాగులను పరిశీలించిన మంత్రి సత్యవతిరాథోడ్‌

మహబూబాబాద్‌:  వర్షాలు భారీస్థాయిలో పడుతుండడంతో మహబూబాబాద్‌లో వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఏటిగడ్డ తండా వాగు, మున్నేరు వాగు, జవాన్లపల్లి పొంగి రోడ్ల మీద ప్రవహిస్తుండడంతో మంత్రి సత్యవతి రాథోడ్ ఆ వాగుల వద్దకు వెళ్లి వరద తీరును పర్యవేక్షించారు. వరద రోడ్ల మీదకు రావడంతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు అధికారుల ద్వారా సాయం అందించారు.  

భారీ వర్షాలతో చెట్లు కూడా కింద పడిపోవడంతో ఆయా ప్రాంతాలను సందర్శించారు. వెంటనే రోడ్డును క్లియర్ చేయాలని, పడిపోయిన చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వీటివల్ల మరో సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు వాగులు, వంకల వరదల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. మంత్రితోపాటు ఎమ్మెల్యే శంకర్ నాయక్, జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు, ఇతర అధికారులు, నేతలు ఉన్నారు. 


తాజావార్తలు


logo