శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 11:46:56

కుర‌విలో శ్రీ వీర‌భ‌ద్ర స్వామిని ద‌ర్శించుకున్న మంత్రి స‌త్య‌వ‌తి

కుర‌విలో శ్రీ వీర‌భ‌ద్ర స్వామిని ద‌ర్శించుకున్న మంత్రి స‌త్య‌వ‌తి

మ‌హ‌బూబాబాద్ : స‌ద్దుల బ‌తుక‌మ్మ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని కుర‌విలోని భ‌ద్ర‌కాళి స‌మేత శ్రీ వీర‌భ‌ద్ర స్వామి వారిని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ శ‌నివారం ఉద‌యం ద‌ర్శించుకున్నారు. ఆల‌య అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో మంత్రికి స్వాగ‌తం ప‌లికి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం చేయించారు. అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. 

స్వామి వారి ద‌ర్శ‌న అనంత‌రం మంత్రి స‌త్య‌వ‌తి మీడియాతో మాట్లాడారు. కుర‌వి ఆల‌య అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ. 5 కోట్లు విడుద‌ల చేశార‌ని తెలిపారు. ఆల‌య అభివృద్ధి పనుల‌ను వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర రైతాంగం కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిత్యం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మంత్రి తెలిపారు.