గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 15:06:51

కవితకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్

కవితకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్‌ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా  రికార్డ్ మెజారిటీతో గెలిచి నేడు ప్రమాణ స్వీకారం చేసిన  కల్వకుంట్ల కవితకు గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి  సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేంద‌ర్‌‌రెడ్డి.. ఆమె చేత ప్రమాణం చేయించారు. ఈ నెల 9న జరి‌గిన నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప‌ఎ‌న్ని‌కల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధిం‌చారు. బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులకు కనీసం డిపా‌జిట్లు కూడా దక్కలేదు. కవిత 2014 నుంచి 2019 వరకు నిజా‌మా‌బాద్‌ ఎంపీగా పని‌చే‌శారు.