శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 18, 2020 , 17:24:37

కవిత రాకతో మహిళా శక్తి పెరుగుతుంది : మంత్రి సత్యవతి

కవిత రాకతో మహిళా శక్తి పెరుగుతుంది : మంత్రి సత్యవతి

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనమండలి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఎంపికైన కవితకు మంత్రి సత్యవతి రాథోడ్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ దాఖలు చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా కవిత గుర్తింపు తెచ్చారన్నారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న మానవీయ నేత కవిత అన్నారు. కవితను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు ధన్యవాదాలన్నారు. సీఎం నిర్ణయం మహిళలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలుపుతుందన్నారు. మండలిలో మహిళా సాధికారతకు సీఎం కేసీఆర్‌ ఇచ్చే ప్రాముఖ్యతకు నిదర్శనమని కొనియాడారు.


logo