ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 13:38:41

డోర్న‌క‌ల్‌తో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

డోర్న‌క‌ల్‌తో త‌న‌కు ప్ర‌త్యేక అనుబంధం : మ‌ంత్రి స‌త్య‌వ‌తి

మ‌హ‌బూబాబాద్ : డోర్న‌క‌ల్ సీఎస్ఐ చ‌ర్చి బిష‌ప్ వాడ‌ప‌ల్లి ప్ర‌సాద‌రావు, ఖాద‌ర్ పాషా మృతిప‌ట్ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ సంతాపం తెలిపారు. ప్ర‌సాద‌రావు గుండెపోటుతో మ‌ర‌ణించ‌గా, ఖాద‌ర్ పాషా క‌రోనాతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే శుక్ర‌వారం ఉద‌యం డోర్న‌క‌ల్‌లోని ప్ర‌సాద‌రావు ఇంటికి వెళ్లిన స‌త్య‌వ‌తి.. ఆయ‌న చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం ఖాద‌ర్ పాషా నివాసానికి వెళ్లిన మంత్రి.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఇరు కుటుంబాల స‌భ్యుల‌ను మంత్రి స‌త్య‌వ‌తి ఓదార్చారు.  


ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. త‌న‌కు డోర్న‌క‌ల్‌తో ప్ర‌త్యేక‌మైన అనుబంధం ఉంద‌న్నారు. త‌న భ‌ర్త రైల్వేలో ఇక్క‌డే ప‌ని చేశార‌ని, ఇక్క‌డ్నుంచే త‌న రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంద‌ని గుర్తు చేశారు. తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు డోర్న‌క‌ల్ ప్ర‌జ‌లు త‌న‌కు అండ‌గా నిలిచార‌ని తెలిపారు. డోర్న‌క‌ల్ అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ప్ర‌సాద‌రావు ఆశయం మేరకు ఈ చర్చి, హాస్పిట‌ల్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు ఇస్తే క‌చ్చితంగా కృషి చేస్తానని మంత్రి \స‌త్య‌వ‌తి రాథోడ్‌ హామీ ఇచ్చారు.


logo