e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 27, 2021
Home News తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి

తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక ఐలమ్మ: మంత్రి సత్యవతి

హైదరాబాద్‌: సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ.. తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.
మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడీదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని చెప్పారు. చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ నివాళులర్పించారు.

ఐలమ్మ జయంతి, వర్థంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని చెప్పారు. తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప సందేశమన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను, పోరాట యోధులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటున్నదని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement