శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 10:41:38

వ‌రంగ‌ల్‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై మంత్రి స‌త్య‌వ‌తి స‌మీక్ష‌

వ‌రంగ‌ల్‌లో స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై మంత్రి స‌త్య‌వ‌తి స‌మీక్ష‌

వ‌రంగ‌ల్‌: రాష్ట్రంలో రెండు రోజుల‌పాటు కురిసిన భారీవాన‌ల‌తో జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. విస్తారంగా కురిసిన వాన‌ల‌తో ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని వాగులు, వంక‌లు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. దీంతో చెరువులు పూర్తిగా నిండి అలుగుపోస్తున్నాయి. ఈనేప‌థ్యంలో వరంగల్ జిల్లాలో ముంపు ప్రాంతాల పరిస్థితి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. వరంగల్ ప‌ట్ట‌ణంలోని సర్క్యూట్ గెస్ట్ హౌజ్‌లో న‌గ‌ర మేయర్ గుండా ప్రకాష్ రావు, కలెక్టర్ రాజీవ్ హనుమంతు, కమిషనర్ సత్పతి, ఇతర అధికారులతో చ‌ర్చించారు. ఆప‌ద‌లో ఉన్న ప్ర‌తిఒక్క‌రిని ఆదుకోవాల‌ని సూచించారు. స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. పున‌రావాస కేంద్రాల్లో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు చెప్పారు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి న‌గ‌రంలోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.