గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 14, 2020 , 19:36:34

సీఎం జన్మదినోత్సవ వేడుకలకు లక్ష మొక్కలు లక్ష్యంగా..

సీఎం జన్మదినోత్సవ వేడుకలకు లక్ష మొక్కలు లక్ష్యంగా..

  హైదరాబాద్  :  మహిళా- శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో ప్రత్యేక హరితహారం కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు  మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, బంగారు తెలంగాణ లక్ష్యంతో వ్యవసాయానికి 24 గంటలు నాణ్యమైన కరెంటును ఇస్తూ, రైతు బందు పథకం ద్వారా పెట్టుబడి ఇస్తూ, రైతు కుటుంబానికి ధీమా కల్పించే రైతు బీమా అమలు చేస్తూ రైతన్నను రాజును చేసేందుకు, వ్యవసాయాన్ని పండగ చేసేందుకు కృషి చేస్తున్న నిజమైన రైతు నేస్తం ముఖ్యమంత్రి కేసిఆర్ .

తెలంగాణలోని కోటి ఎకరాలను మాగాణి చేసేందుకు మానవ నిర్మిత అద్భుతంగా నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు రూపశిల్పి. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి తండ్లాటను రూపుమాపి ఇంటింటికి పరిశుభ్ర నీటినందించిన అపర భగీరథుడు. భావితరాలు బాగుండాలంటే తెలంగాణ పచ్చగా ఉండాలని హరిత తెలంగాణ లక్ష్యంగా కృషి చేస్తున్న నిరంతర శ్రామికుడు గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మహిళా-శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ పరిధిలోని అంగన్ వాడీలు, గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, ఏకలవ్య విద్యాలయాలు, డైరెక్టరేట్లు, ఐటీడీఏ కార్యాలయాలలో లక్ష మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథాడో నిర్ధేశించారు.


 ఈమేరకు గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ అధికారులతో నేడు దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో సమీక్ష చేసి లక్ష మొక్కలు నాటేందుకు ప్రత్యేక హరితహారం కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ప్రజల కష్టాలను తీరుస్తూ, భవిష్యత్ తరాల బాగును కోరుతున్న ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష మొక్కలు నాటే ప్రత్యేక హరితహారాన్ని ఆయన పుట్టిన రోజు బహుమానంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి విద్యార్థి, సిబ్బంది, అధికారులు సమిష్టిగా ఈ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి పుట్టిన రోజు ప్రత్యేక హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో మహిళా-శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ శ్రీమతి దివ్య, అదనపు కార్యదర్శి నిర్మల, జాయింట్ డైరెక్టర్ అనురాధ,  గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు నికోలస్, సర్వేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


logo