మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 10:53:43

అమ‌రవీరుల స్తూపం వ‌ద్ద మంత్రి స‌త్య‌వ‌తి నివాళి..

అమ‌రవీరుల స్తూపం వ‌ద్ద మంత్రి స‌త్య‌వ‌తి నివాళి..

మ‌హ‌బూబాబాద్‌‌: తెలంగాణ రాష్ట్రం అవతరించి ఆరేళ్లు పూర్తి చేసుకొని 7వ వసంతంలోకి అడుగుపెడుతున్న పర్వదినాన మహబూబాబద్ అమర వీరుల స్తూపం వద్ద ఇవాళ గిరిజ‌న సంక్షేమ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌ నివాళులు అర్పించారు.  జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం  చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపి శ్రీమతి మాలోత్ కవిత, ఎమ్మెల్యే శ్రీ శంకర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ శ్రీ ఇంద్రసేనా రెడ్డి, కలెక్టర్ శ్రీ గౌతమ్, ఎస్పీ శ్రీ కోటిరెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులు  పాల్గొన్నారు. 

కేసిఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అన్న తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మంత్రి శ్రీ కేటిఆర్ చేసిన వ్యాఖ్య‌లు నిజమై రాష్ట్రంలో నేడు జలకళ ప్రతి కాలువలో, చెరువులో, రిజర్వాయర్ లో కనిపిస్తూ.. కరువు అన్న పదం తెలంగాణ చెరువుల్లో  శాశ్వతంగా సమాధై.. నీళ్ల బాధ సమూలంగా తొలిగింద‌ని మంత్రి స‌త్య‌వ‌తి తెలిపారు.

సిఎం కేసిఆర్ ఇచ్చిన హామీ మేరకు మానుకోటలోని చివరి ఆయకట్టు వరకు నీరు తీసుకురావడంలో, ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకంలో జిల్లాను ముందంజలో నిలబెట్టడంలో ఇక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో, సలహాలతో, సహకారంతో మంత్రిగా నా బాధ్యతలు సంపూర్ణంగా నిర్వహిస్తానని ఈ పర్వదినాన ప్రతిజ్ణ చేస్తున్న‌ట్లు మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తెలిపారు.logo