గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 10:31:29

గాంధేయమార్గం ఎప్ప‌టికీ ఆచ‌ర‌నీయ‌మే: మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

గాంధేయమార్గం ఎప్ప‌టికీ ఆచ‌ర‌నీయ‌మే: మ‌ంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్‌

హైదరాబాద్: మ‌హాత్ముడు చూపిన గాంధేయ‌మార్గం ఎప్ప‌ట‌కీ ఆచ‌ర‌నీయ‌మేన‌ని, ప్ర‌తిఒక్క‌రు ఆయ‌న బాట‌లో ప‌య‌ణించాల‌ని మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. జాతిపిత మ‌హాత్మా గాంధీ 151వ జయంతి, దేశ రెండో ప్ర‌ధాని లాల్‌బ‌హదూర్ శాస్త్రి జ‌యంతి సంద‌ర్భంగా మంత్రి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు. పల్లె సీమలే దేశానికి పట్టు కొమ్మలన్న గాంధీజీ బాటలోనే సీఎం కేసీఆర్ పయనిస్తున్నారని చెప్పారు. గ్రామాల స్వయం సమృద్ధి, పల్లెల‌ ప్రగతి కోసం పాటుపడుతున్నారని వెల్ల‌డించారు. మ‌హాత్ముడు అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం సాధించార‌ని, ఆయన మార్గంలో నడిచి రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ బాపు కేసీఆర్ అని అన్నారు.  

మాజీ ప్ర‌ధాని లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి జై జవాన్, జై కిసాన్ అని నినదించి ఈ దేశానికి సైనికుడు, రైతు ప్రాముఖ్యతను తెలిపార‌న్నారు. సైనిక కుటుంబాలకు ఈ దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా మద్దతు పలికార‌ని, రైతును రాజు చేయాలనే సంకల్పంతో మాజీ ప్ర‌ధాని మాటలను సీఎం కేసీఆర్ ఆచరణలో చేసి చూపుతున్నార‌ని ప్ర‌క‌టించారు. 


logo