సోమవారం 01 జూన్ 2020
Telangana - May 01, 2020 , 01:11:08

అంగన్‌వాడీల్లో ఆన్‌లైన్‌ పాఠాలు

అంగన్‌వాడీల్లో ఆన్‌లైన్‌ పాఠాలు

  • మంత్రి సత్యవతి రాథోడ్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు ఇంటి దగ్గరే విజ్ఞానాన్ని, ఆహ్లాదాన్ని పొందేందుకు చిన్న కథలతో ఆన్‌లైన్‌ పాఠాలు మొదలుపెట్టామని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. గురువారం తన కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ పాఠాలను మంత్రి ప్రారంభించారు. అంగన్‌వాడీకేంద్రాల నుంచి లబ్ధిదారుల అందే సరుకుల సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌లో అంగన్‌వాడీల సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి గురువారం నుంచి రెండోవిడుత మాస్కుల పంపిణీ చేపట్టినట్టు చెప్పారు. సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌, ప్రత్యేక కార్యదర్శి దివ్య, ఉమెన్‌ కార్పొరేషన్‌ ఇంచార్జి సబిత, జేడీ లక్ష్మి, అనురాధ, ఏడీ గిరిజ పాల్గొన్నారు.logo