శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 11:56:42

'సఖి' కేంద్రానికి మంత్రి స‌త్య‌వ‌తి శంకుస్థాప‌న‌

'సఖి' కేంద్రానికి మంత్రి స‌త్య‌వ‌తి శంకుస్థాప‌న‌

ములుగు : జిల్లాలో మహిళల సమస్యలన్నింటికీ పరిష్కారంగా పని చేసే సఖీ కేంద్రానికి రూ. 49 లక్షల అంచనా వ్యయంతో నిర్మించే భవనానికి రాష్ర్ట గిరిజ‌న‌, స్ర్తీ-శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం రూ. 27.5 లక్షల వ్య‌యంతో నిర్మించిన గిరి బ్రాండ్ శానిటరీ నాప్కిన్స్ యూనిట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ యూనిట్‌ గిరిజన మహిళల ఆధ్వర్యంలో న‌డ‌వ‌నుంది. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపీ కవిత, ఎమ్మెల్యే సీతక్క, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జండగే, ఎస్పీ సంగ్రామ్ సింగ్, స్థానిక జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.