గురువారం 09 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 19:50:15

అపస్మారక స్థితిలో డాక్టర్‌.. హాస్పిటల్‌కు తరలించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

అపస్మారక స్థితిలో డాక్టర్‌.. హాస్పిటల్‌కు తరలించిన మంత్రి సత్యవతి రాథోడ్‌

హైదరాబాద్‌ : ఆమె సహజంగానే దయామయి. ఎవరినీ నొప్పించని తత్వం. ఎవరైనా బాధపడితే చూడలేని మనస్తత్వం. అలాంటామె కళ్ల ముందు రోడ్డు మీద ఒక వాహనదారుడు అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తే ఇక ఆ స్పందన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. నిజంగా నేడు ఈ సందర్భమే ఎదురైంది. మహబూబాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వస్తుండగా మహబూబాబాద్‌ జిల్లా ఆలేరు దగ్గర బంజారా గ్రామానికి సమీపంలో రోడ్డు మీద రాత్రి 7 గంటలకు ఒక ఆర్‌.ఎం.పి డాక్టర్‌ కింద పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించారు. కింద పడడంతో ఆయన తలకు దెబ్బతగిలింది. దీనిని గమనించిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్‌ తన కాన్వాయిని ఆపి ఆ ఆర్‌ఎంపీ డాక్టర్‌ని తన పైలట్‌ వాహనంలో తన భద్రతా విభాగంలోని ఒక అధికారిని ఇచ్చి హాస్పిటల్‌కు పంపించారు.


logo