శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 12:20:35

బోడతండా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం

బోడతండా మృతుల కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం

మహబూబాబాద్‌: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయిన నలుగురు బాలుర కుటుంబాలను మంత్రి సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. వారికి రూ.50 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. జిల్లాలోని శనిగపురం గ్రామపంచాయతీ పరిధిలోని బోడతండాకు చెందిన నలుగురు బాలురు శనివారం ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానాలో ఉన్న నలుగురి మృతదేహాలను సందర్శించారు, వారి మృతికి సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

అదేవిధంగా శనిగపురం గ్రామానికి చెందిన పాపా (55) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. వారికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మృతుల కుంటుబాల వద్దకు స్వయంగా వెళ్లి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మంత్రితోపాటు ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.


logo