బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 12:36:12

నిత్యావసరాలు పంపిణీ చేసిన సత్యవతి రాథోడ్‌

నిత్యావసరాలు పంపిణీ చేసిన సత్యవతి రాథోడ్‌

మహబూబాబాద్‌: జిల్లాలోని గూడూరులో రేషన్‌కార్డు లేని గిరిజనులకు మంత్రి సత్యవతి రాథోడ్‌ నిత్యావసరాలను పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గిరిజన శాఖ ఆధ్వర్యంలోని విద్యాలయాలు మూసివేశారు. అందులో విద్యార్థులకు కోసం నిలువ చేసిన నిత్యావసర సరుకులను మంత్రి శాఖ ఆధ్వర్యంలో ఆమె గిరిజనులకు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పేదలు ఇబ్బంది పడుతున్నారని, రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారని, ఆ సమస్య తప్పకుండా నెరవేరుతుందన్నారు. కరోనా వైరస్‌ ఇప్పటికిప్పుడే పోయే పరిస్థితి లేదని, అది మనకు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. లాక్‌డౌన్‌తో సమస్యలు ఎదుర్కొంటున్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.


logo