మంగళవారం 26 మే 2020
Telangana - May 19, 2020 , 13:52:15

గుగులోతు రవీంద్ర నాయక్‌ మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం

గుగులోతు రవీంద్ర నాయక్‌ మృతిపట్ల మంత్రి సత్యవతి సంతాపం

హైదరాబాద్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసిన గుగులోత్‌ రవీంద్ర నాయక్‌ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రవీంద్ర నాయక్‌ మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం ప్రకటించారు. నాయక్‌ కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో రవీంద్ర నాయక్‌ ముందుండి పోరాడారని సత్యవతి గుర్తు చేసుకున్నారు. రవీంద్ర నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి సత్యవతి భరోసానిచ్చారు. నాయక్‌ స్వస్థలం మహబూబాబాద్‌ జిల్లాలోని మరిపెడ మండలం తాళ్ల ఊకల్‌ గ్రామం.  


logo