హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక మంత్రి, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు పుట్టినరోజు సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పది కాలాల పాటు ప్రజా సేవలో కొనసాగాలని, భగవంతుడు ఆయనకు శక్తిని ప్రసాదించాలని కోరుకున్నారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.
కాగా, తన పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు చెప్పడానికి, ఆశీర్వదించడానికి ఎవరూ రావద్దని మంత్రి హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా, లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంత్రి ట్వీట్ చేశారు. ‘మిత్రులు, అభిమానులకు హృదయపూర్వక నమస్కారాలు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి కలుస్తామని ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ సారి కూడా జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’.