శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 05, 2020 , 15:13:35

స్త్రీలు శక్తి స్వరూపిణీలు : మంత్రి సత్యవతి

స్త్రీలు శక్తి స్వరూపిణీలు : మంత్రి సత్యవతి

యాదాద్రి భువనగిరి : భువనగిరిలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌, రాచొకండ సీపీ మహేశ్‌ భగవత్‌, డీసీపీ నారాయణరెడ్డి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ.. మహిళలు వారికున్న చట్టాలను తప్పకుండా తెలుసుకోవాలన్నారు. కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకువచ్చారని తెలిపారు. సమాజంలో ఉండే లింగ వివక్షత నిజంగా తల్లిదండ్రుల దగ్గరి నుంచే ప్రారంభం అవుతుందన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు చెప్పే జాగ్రత్తలను మగపిల్లలకు చెప్పట్లేదు. నిజానికి స్త్రీలు శక్తి స్వరూపిణీలు అని మంత్రి తెలిపారు.

మహిళలకు అవకాశం ఇస్తే సమాజంలో ఏదైనా చేయగలరు అని పేర్కొన్నారు. దేశంలో తొలిసారి తెలంగాణలో ఆరోగ్యలక్ష్మి పథకం తీసుకొచ్చామని తెలిపారు. యాదగిరిగుట్టలో వ్యభిచారాన్ని పూర్తిగా అరికట్టామని ఆమె స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ విద్యాసంస్థల్లో విద్యార్థినులకు మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్పిస్తామని మంత్రి చెప్పారు. పోలీసు శాఖ నుంచి మహిళలకు పూర్తిగా అండదండలు ఉండాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ కోరారు.logo