ఆదివారం 24 మే 2020
Telangana - Mar 04, 2020 , 15:30:51

కేసీఆర్‌ నాయకత్వంలోనే రైతులకు మేలు : మంత్రి సత్యవతి

కేసీఆర్‌ నాయకత్వంలోనే రైతులకు మేలు : మంత్రి సత్యవతి

వరంగల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలోనే రైతులకు మేలు జరిగిందని.. రాబోయే రోజుల్లో రైతును రాజు చేయడమే తమ సర్కార్‌ లక్ష్యమని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఉద్ఘాటించారు. వరంగల్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌ రావు ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి సత్యవతి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో రైతులంతా ఏకపక్షంగా తీర్పునిచ్చారు. రైతుల కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంట్‌, రైతుబంధు, రైతుబీమా ఇచ్చి రైతు బాంధవుడిగా సీఎం కేసీఆర్‌ మారారని మంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి రుణమాఫీ కూడా ఇవ్వబోతున్నట్లు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కొత్త సంస్కరణలు, పాలనతో రైతుల నమ్మకాన్ని చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పొందాలి. నలుగురికి అన్నం పెట్టే రైతు ఆనందంగా ఉండేలా ఈ పాలక వర్గం పని చేస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


logo