శుక్రవారం 29 మే 2020
Telangana - Apr 02, 2020 , 08:09:35

మంత్రి సత్యవతి శ్రీరామనవమి శుభాకాంక్షలు

మంత్రి సత్యవతి శ్రీరామనవమి శుభాకాంక్షలు

హైదరాబాద్‌ : రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలంగాణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ శ్రీరామనవమిని ఇంట్లోనే ఉండి జరుపుకోవాలని ఆమె కోరారు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో స్వీయ నియంత్రణ పాటిస్తూ, ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ప్రజలందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శనీయమని, తండ్రి మాట కోసం 14 ఏళ్ల పాటు వనవాసం చేశారని గుర్తు చేశారు. అదే రీతిలో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ మాట మేరకు ఈ నెల 14వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ ఇండ్లలోనే ఉండి కరోనా కట్టడికి సహకరించాలని మంత్రి సత్యవతి కోరారు.


logo