గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 09, 2020 , 11:50:51

రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య‌ను ప‌టిష్టంచేశాం: మ‌ంత్రి స‌బిత‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య‌ను ప‌టిష్టంచేశాం: మ‌ంత్రి స‌బిత‌

హైద‌రా‌బాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నాయ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్య‌ను ప‌టిష్టంచేశామ‌న్నారు. టీ న్యూస్‌ చానల్‌, అపెక్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న తెలంగాణ గోల్డెన్ ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌ను మంత్రి ప్రారంభించారు. 

ఏడేండ్లుగా ఎంతో మంది విద్యార్థుల‌కు ఎడ్యుకేష‌న్ ఫెయిర్ మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తున్న‌ద‌ని చెప్పారు. అత్యంత ఆద‌ర‌ణ ఉన్న కోర్సుల‌ను ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చింద‌ని వెల్ల‌డించారు. ఇత‌ర రాష్ట్రాల విద్యార్థులు మ‌న‌ద‌గ్గ‌ర‌ ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించేలా తెలంగాణ‌లోని కాలేజీల‌ను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సూచించారు. ఈ ఎడ్యుకేష‌న్ ఫెయిర్ అమీ‌ర్‌‌పే‌ట‌లోని కమ్మసంఘం కార్యా‌ల‌యంలో మూడు రోజుల‌పాటు జ‌రుగ‌నుంది. 


logo