శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 14:48:46

రైతువేదికను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

రైతువేదికను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వికారాబాద్ : జిల్లాలోని ధారూర్ మండల కేంద్రంలో రైతు వేదికను విద్యాశాఖ మంత్రి  సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుకు ఏ సమస్య వచ్చిన రైతు వేదికకు రావాలన్నారు. రైతు సంఘటితం అయితేనే రైతులు బాగు పడతారని, తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించే స్థాయికి రైతు ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. రూ. 600 కోట్ల తో తెలంగాణ వ్యాప్తంగా 2,604 రైతు వేదికలను స్వల్ప కాలంలో నిర్మాణాలు పూర్తి చేశామన్నారు.

జిల్లాలో 21 కోట్ల 34 లక్షల రూపాయల తో 97 రైతు వేదికల నిర్మాణం పూర్తయిందన్నారు. త్వరగా పూర్తి చేయించడంలో చొరవ చూపిన కలెక్టర్, జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందించారు. రైతు బాంధవునిగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమం కోసం పాటు పడుతున్నారని పేర్కొన్నారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డి , ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కలెక్టర్ పౌసుమి బసు, అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, జడ్పీటీసీ సుజాత, ఎంపీపీ విజయలక్ష్మి ,సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి ,రైతు బంధు అధ్యక్షుడు రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు పాల్గొన్నారు.