గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 19, 2020 , 18:33:22

సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం

సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో గత వందేండ్ల చరిత్రలో వచ్చిన భారీ వర్షాల వల్ల ఎంతో మంది నష్టపోయారు. వారికి పెద్ద మనసుతో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ.. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ భారీ వర్షాల వల్ల  ప్రభావితమైన ఇండ్లకు పది వేలరూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు యాభై వేల రూపాయలు, పూర్తిగా కూలిపోయిన ఇండ్లకు లక్ష రూపాయల పరిహారాన్ని అందజేయాలని తీసుకున్న నిర్ణయంపై రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.