గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 16:32:26

ఉప్ప‌ల్‌లో రూ. కోటితో గ్రంథాల‌య నిర్మాణం

ఉప్ప‌ల్‌లో రూ. కోటితో గ్రంథాల‌య నిర్మాణం

రంగారెడ్డి : ఉప్ప‌ల్ ప‌రిధిలోని బీర‌ప్ప‌గ‌డ్డ‌లో నూత‌న గ్రంథాల‌యం నిర్మాణ ప‌నుల‌కు మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డి శంకుస్థాప‌న చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జ‌నార్ధ‌న్ రెడ్డి, రాష్ర్ట గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ శ్రీధ‌ర్ పాల్గొన్నారు. 

శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నిర్ణ‌యం మేర‌కు విద్యార్థులు, యువ‌త‌లో పుస్త‌క ప‌ఠ‌న శ‌క్తి పెరిగేలా ఆధునిక స‌దుపాయాలు, టెక్నాల‌జీతో గ్రంథాల‌యాలు ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. కోటి రూపాయాల‌తో ఉప్ప‌ల్‌లో లైబ్ర‌రీ నిర్మిస్తున్నామ‌ని ఆమె పేర్కొన్నారు. ఇత‌ర ప్రాంతాల్లో స్థ‌లాలు గుర్తిస్తే నూత‌న లైబ్ర‌రీలు నిర్మిస్తామ‌న్నారు. కొవిడ్ నేప‌థ్యంలో అమ‌లు చేస్తున్న డిజిట‌ల్ త‌ర‌గ‌తుల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే వారం నుంచి దూర‌ద‌ర్శ‌న్‌లో ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియం ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు ప్రారంభ‌మవుతాయ‌ని తెలిపారు. సెల‌వుల కార‌ణంగా విద్యార్థులు న‌ష్ట‌పోకుండా ఆన్‌లైన్ క్లాసుల నిర్వ‌హ‌ణ చేప‌ట్టామ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి చెప్పారు.


logo