శనివారం 15 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 13:35:06

‘ర్యాపిడ్ యాంటీజెన్’ టెస్ట్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

‘ర్యాపిడ్ యాంటీజెన్’ టెస్ట్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : రోజు రోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా .. రవాణా శాఖ మంత్రి పువ్వాడ  అజయ్ కుమార్ సత్వర చర్యలు చేపడుతున్నారు. మంత్రి చొరవతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 10 వేల ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు సోమవారం గాంధీచౌక్ లోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కొవిడ్-19(ర్యాపిడ్ యాంటీజెన్  టెస్ట్) నిర్ధారణ పరిక్షాల కేంద్రాన్ని మంత్రి అజయ్ కుమార్  ప్రారంభించారు. 


అవసరమైన వారికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవలని కోరారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి , డీఎంహెచ్ వో మాలతి  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు


logo