శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 17, 2021 , 15:02:35

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలంలోని వీవీపాలెం గ్రామంలో రూ. 2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణ పనులకు, రఘునాధపాలెం మండలంలోని మంచుకొండ గ్రామంలో రూ. 2 కోట్లతో నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్, రోడ్ విస్తరణ పనులకు శంఖుస్థాపన చేశారు. రఘునాధపాలెం మండలంలోని శివాయిగూడెం గ్రామంలో రూ. 12.60 లక్షలతో నూతనంగా నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్‌ఎస్‌ హయాంలోనే రాష్ట్రంలో పలు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.


VIDEOS

logo