శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 15:32:07

అంబులెన్స్ ను అందజేసేందుకు ముందుకొచ్చిన మంత్రి పువ్వాడ

అంబులెన్స్ ను అందజేసేందుకు ముందుకొచ్చిన మంత్రి పువ్వాడ

హైదరాబాద్ : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజు సందర్భంగా 'గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బహుమతులు, బొకేలు తేకుండా పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపండన్న మంత్రి పిలుపునకు స్పందించిన ప్రజాప్రతినిధులు సేవాకార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకొస్తున్నారు.  తాజగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రభుత్వ హాస్పిటల్స్ కోసం అంబులెన్స్ అందజేసేందుకు ముందుకొచ్చారు.

తన సొంత డబ్బులతో రూ.23 లక్షల చెక్కును  హైదరాబాద్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు మంత్రి పువ్వాడను కేటీఆర్ అభినందించారు.


logo