25.4.2021 నుంచి 1.5.2021 వరకు
మేషం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు పెంపొందుతాయి. అవగాహన పెరుగుతుంది. తద్వారా కొత్త పనులను ప్రారంభించే అవకాశం ఉంటుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా రావడంతో కొన్ని పనులలో జాప్యం జరుగవచ్చు. అన్నదమ్ములు, బంధుమిత్రులతో సత్సంబంధాలు, కార్యసాఫల్యత ఉంటాయి. వాహనప్రాప్తి, వాహనాలవల్ల పనులు కలిసివస్తాయి. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణం, భూముల కోసం పెట్టుబడులు పెడతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి.
వృషభం
గతంతో పోల్చితే ఆర్థిక పరిస్థితి కొంత అస్థిరంగా ఉంటూ, ఖర్చులు పెరుగవచ్చు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో అందరితోనూ కలిసిమెలసి ఉండటం అవసరం. అందరి సహకారం కోసం ప్రయత్నిస్తారు. ప్రయాణాలవల్ల ఖర్చులు పెరిగినా వ్యాపార సంబంధ పనులు కలిసివస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ విషయాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొంతవరకు అనుకూలించవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా కలిసివస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందక పోవడంతో కొన్ని పనులలో జాప్యం జరుగుతుంది. ముఖ్యంగా ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలో పెట్టడం అవసరం. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
మిథునం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. గత ఇబ్బందులను అధిగమిస్తారు. కార్యానుకూలత, ప్రయత్నాలు కలిసివచ్చి వివాహాది శుభకార్యాలు చేస్తారు. చదువు విషయంలో ఈవారం కలిసివస్తుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలలో సఫలీకృతులై ఉద్యోగంలో చేరతారు. వృత్తి, వ్యాపారంలో సంతృప్తిగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఖర్చులు మాత్రం పెరుగవచ్చు. పాత ఆటంకాలు దూరమై పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. కుటుంబపెద్దల సహకారం అందుతుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటకం
ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతృప్తిగా ఉంటారు. ఆఫీసులో ఉత్సాహంతో పనులు చేస్తారు. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారులతో స్నేహభావం పెంచుకోవడం అవసరం. స్థానచలనం ఉండవచ్చు. నిత్య వ్యాపారం అనుకూలిస్తుంది. న్యాయ పరమైన సమస్యలు తీరుతాయి. కోర్టు పనులలో అనుకూలత ఉంటుంది. స్నేహితులు, బంధువర్గంతో వివాదాల్లోకి వెళ్లకుండా పనులు చేసుకోవడం మంచిది. పెద్దల సహకారం లభిస్తుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు సిబ్బందితో ఇబ్బందులు ఉండవచ్చు.
సింహం
ఆత్మీయులు, స్నేహితులతో సంబంధాలు పెరుగుతాయి. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. భూములు, ఆస్తుల వివాదాలు పరిష్కారమవుతాయి. కొన్ని పనులలో సాహసించి నిర్ణయాలు తీసుకొని సత్ఫలితాలు పొందుతారు. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అనుకూలమైన వారం. అందరి సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు వస్తుంది. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేపీ పెరుగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారం కలిసి వస్తుంది. విద్యార్థులకు చదువు విషయంలో అనుకూలం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.
కన్య
ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేపీ పెరుగుతుంది. పనులను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. వాహనాలవల్ల ఖర్చులు ఉండవచ్చు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అత్యుత్సాహం, తొందరపాటు పనికిరాదు. శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారం అందుతుంది. వ్యాపారంలో భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగానే ఉంటాయి. రావలసిన డబ్బు విషయంలో జాప్యం జరుగవచ్చు. సరదాలు, వినోదాలకు ఖర్చు పెరుగుతుంది. కొత్త పరిచయాలతో కొన్ని పనులు నెరవేరవచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అందరితోనూ స్నేహభావం పెంపొందించుకుంటారు. పనులను పట్టుదలతో పూర్తి చేయడం ఈవారం అవసరం.
తుల
గతంతో పోల్చితే ఈవారం కొంత అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో కదలిక ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. చదువులో రాణిస్తారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం, వృత్తి లాభసాటిగా ఉంటాయి. న్యాయ సమస్యలు తీరుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు ఆత్మీయులతో ఇబ్బందులు ఉండవచ్చు. వృథా ఖర్చులు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూలత ఉన్నా వ్యయాధికం ఉండవచ్చు.
వృశ్చికం
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అనుకూలత ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కొన్ని పనులలో ఆలస్యం వల్ల అసంతృప్తి ఉండవచ్చు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించి శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలికంగా అనుకూలత ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. సంతృప్తిగా ఉంటారు. న్యాయ సమస్యలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. సిబ్బందితో స్నేహభావం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
ధనుస్సు
ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఇంటికి కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. రచయితలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. విందులకు హాజరు అవుతారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలి. సమస్యలను పరిష్కరించడంలో బంధుమిత్రుల సహాయం అవసరం పడవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది అనుకూలత ఉంటుంది. రావలసిన డబ్బు అందకపోవడంతో పనులలో ఆలస్యం ఉంటుంది.
మకరం
గతంతో పోల్చితే ఈవారం అనుకూలంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. సమాజంలో మంచివారితో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్త్ర, వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుభవజ్ఞులు, తల్లిదండ్రుల దీవెనలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిత్య వ్యాపారం క్రమేపీ వృద్ధిలోకి వస్తుంది. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. బంధువులు, అన్నదమ్ములు, శ్రేయోభిలాషుల సహకారం బాగా లభిస్తుంది. ఉద్యోగం కలిసివస్తుంది. శని ప్రభావం వల్ల కొంత వృథా వ్యయం ఉండవచ్చు.
కుంభం
ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. తోటి ఉద్యోగుల సహకారం బాగా అందుతుంది. సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. సంతోషంతో ఉంటారు. ఉత్సాహంగా పనులను నిర్వర్తిస్తారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో అనుకూలత ఉంటుంది. గత పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులు, రచయితలకు అనుకూలమైన వారం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం అనుకూలిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాలతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. సమస్యలను అధిగమిస్తారు.
మీనం
రావలసిన డబ్బు చేతికి అందడంతో సంతృప్తి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. గత పెట్టుబడులవల్ల ప్రతిఫలాలు అందుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసులలో తీర్పు అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. రచయితలు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. ఈవారం కలిసి వస్తుంది. ప్రయాణాలు ఫలప్రదంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఆహార నియమాలను పాటిస్తూ పనులపట్ల శ్రద్ధ చూపుతారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in